Header Banner

యాదగిరిగుట్టలో నృసింహ జయంతి.. పాల్గొన్న వివిధ ఆధ్యాత్మిక సంస్థలు, భక్త సమాజాలు!

  Sun May 11, 2025 12:02        Politics

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి మహోత్సవ శోభతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఈ సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వెంకట్రావు ఈ కార్యక్రమానికి స్వయంగా నేతృత్వం వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పలు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, భక్త సమాజాలకు చెందిన సభ్యులు, సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గోమాతను ముందుంచుకుని, జాతీయ పతాకాన్ని చేతబూని, స్వామివారి నామస్మరణ చేస్తూ, భక్తి ప్రపత్తులతో కొండ చుట్టూ తిరిగి ప్రదక్షిణ పూర్తిచేశారు. భక్తుల కోలాహలంతో యాదగిరి కొండ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. గిరి ప్రదక్షిణ ముగించుకున్న అనంతరం భక్తులందరూ కొండపైకి చేరుకుని ప్రధాన ఆలయంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో వెంకట్రావు మాట్లాడుతూ నరసింహ జయంతి ఉత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ అని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. 

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting